meal maker pakoda recipe By , 2016-11-02 meal maker pakoda recipe Meal Maker Pakoda andhra special. Prep Time: 20min Cook time: 25min Ingredients: వంద గ్రాముల మీల్‌మేకర్,అర కప్పు కార్న్‌ఫ్లోర్  ,అర కప్పు బియ్యంపిండి  ,అర కప్పు శనగపిండి  ,2 ఉల్లిపాయలు  ,ఒక నిమ్మకాయ  ,కొద్దిగా కొత్తిమీర  ,కొద్దిగా కరివేపాకు  ,సరిపడనంత నూనె  ,సరిపడినంత ఉప్పు, కారం ,రెండు స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్టు  , Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. అందులో మీల్‌మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. Step 2 ఇప్పుడు వీటిని 10 నిమిషాలు నీళ్లలోనే ఉంచి, తరువాత వేరే పాత్రలోకి మీల్‌మేకర్‌ని తీసుకుని మెత్తగా చేయాలి. Step 3 అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. Step 4 బాణలిలో నూనె పోసి కాగాక పకోడీల మాదిరిగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే కర కరలాడే మీల్ మేకర్ పకోడీ రెడీ, వీటిని టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day