methi matar pulao recipe By , 2016-11-03 methi matar pulao recipe methi matar pulao recipe. Prep Time: 20min Cook time: 30min Ingredients: నాలుగు కట్టల లేత మెంతి కూర,అర కిలో పన్నీర్,100గ్రాములు మటర్ (ఫ్రోజెన్ పచ్చి బఠానీలు),అర కట్ట కొత్తి మీర ,రెండు గ్లాసుల బాస్మతీ బియ్యం,రెండు స్పూన్ల ధనియాల పొడి,2 స్పూన్ల జీల కర్ర పొడి,ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ,మూడు ఉల్లిపాయలు (సన్నగా నిలువుగా తరిగినవి),నాలుగు పచ్చి మిరపకాయలు (మధ్యలోకి కోసినవి),తగినన్ని ఏలకులు, లవంగాలు, దాల్చెన్ చెక్క, జాపత్రి, మిరియాలు, జీల కర్ర,తగినంత నూనె, ఉప్పు, పసుపు, కారం,ఒక స్పూన్ వెన్న (అన్‌సాల్టెడ్ బటర్) , Instructions: Step 1 ముందుగా బాస్మతీ బియ్యాన్ని ఓ అరగంట సేపు నీళ్లల్లో నాన బెట్టుకోవాలి. Step 2 బాణలిలో కొద్దిగా నూనె వేసి ఏలకులు, లవంగాలు, దాల్చెన్ చెక్క, జాపత్రి, మిరియాలు, జీల కర్ర వేసి దోరగా వేగిన తరువాత దానిలో ఉల్లిపాయలు, కోసిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాసేపు వేయించాలి. Step 3 తరువాత పన్నీరును ముక్కలుగా కోసి,బఠాణీలను అందులో వేయాలి. మెంతికూరను, కొత్తిమీరను శుభ్రంగా కడిగి, సన్నగా కోసి అందులో వేయాలి. ఈ మిశ్రమం కాస్త వేగిన తరువాత అందులో నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేయాలి. Step 4 బియ్యానికి తగినంత వేడి నీటిని ఆ మిశ్రమంలో పోసి తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా వెన్న వేసి 10-15 నిమిషాలు బాస్మతీ బియ్యం పొడి పొడిగా ఉడికేలా మధ్య సెగలో మూతపెట్టి ఉడికించాలి. Step 5 పులావ్ బాగా రావాలంటే బాస్మతీ బియ్యం నాన పెట్టడం చాలా ముఖ్యమైన అంశం. అలాగే, అది ఉడికేటప్పుడు కలపకుండా ఉండాలి. (కలిపితే బాస్మతీ మెతుకులు విడివిడిగా కాకుండా ముద్దగా అయిపోతాయి. వేడి నీళ్లు పోయటం కూడా ముఖ్యం. చన్నీళ్ళు పోస్తే ఉడకటానికి ఎక్కువ సమయం పట్టి బాస్మతీ అన్నం పొడి పొడిగా రాదు). Step 5 అలంకరణగా వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఉపయోగించవచ్చు. వెల్లుల్లి వాడని వారు అల్లం పేస్టు మాత్రమే వేసుకోవచ్చు. Step 5 అంతే రుచికరమైన పలావ్ రెడీ అయినట్లే. దీనిని రైతాతో గానీ, గ్రేవీ కూరతో కానీ లాగించేయొచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day