okra mutton curry recipe cooking tips By , 2014-12-31 okra mutton curry recipe cooking tips okra mutton curry recipe cooking tips : the cooking tips to make okra mutton curry recipe Prep Time: 30min Cook time: 40min Ingredients: 1/2 కేజీ మాంసం, కొద్దిగా చింతపండు, 1/4 కేజీ బెండకాయలు, 3 ఉల్లిపాయలు, 2 టీ స్పూన్స్ అల్లంవెల్లుల్లి ముద్ద, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్స్ పసుపు, 2 టీ స్పూన్స్ పెరుగు, 1/2 టీ స్పూన్స్ గరంమసాలా, 1/2 కప్ కొత్తిమీర తురుము, 1/2 కప్ నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా మటన్ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాసులో కొద్దిగా నీటిని పోసి అందులో చింతపండును వేసి పావుగంటసేపు నానబెట్టుకోవాలి. బెండకాయలను కూడా ముందూవెనుకలు కోసివేసి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక బాణలి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి. అనంతరం తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలోనే ఉల్లిపాయ ముక్కల్ని, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. Step 3 అనంతరం అందులోనే మటన్ ముక్కలను వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ప్రెషర్ కుక్కర్’లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి.. నీరు మొత్తం ఆవిరి అయిపోయేంతవరకు ఎక్కువ వేడి మీద వేయించాలి. Step 4 మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం, పెరుగు, బెండకాయ ముక్కలు వేసి మీడియం మంటమీద ఉడికించాలి. దీనికి కాస్తంత గరంమసాలా, కొత్తిమీర చల్లి.. గ్రేవీ చిక్కబడగానే దించేయాలి. అంతే!
Yummy Food Recipes
Add