egg potato curry recipe cooking tips telugu news By , 2014-12-30 egg potato curry recipe cooking tips telugu news egg potato curry recipe cooking tips telugu news : the cooking tips to make egg potato curry which is good for health. Prep Time: 30min Cook time: 30min Ingredients: 4-5 గుడ్లు, 2-3 బంగాళదుంపలు (చిన్న సైజులో కట్ చేయాలి), 2-3 ఉల్లిపాయలు (సన్నగా తరగాలి), 2-3 టమోటాలు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి), 3-4 పచ్చిమిర్చి, 3 పాయలు అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరంమసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ధనియాలపొడి, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్స్ నూనె, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలను, గుడ్లను విడివిడిగా నీళ్లలో వేడిచేసుకోవాలి. తర్వాత చల్లార్చి.. వాటికి వున్న పొట్లను పూర్తిగా తీసేసి.. పక్కన పెట్టుకోవాలి. Step 2 స్టౌవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి.. రెండు నిముషాలవరకు ఫ్రై చేయాలి. Step 3 ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేగించిన అనంతరం అందులో టమోటా ముక్కలను వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. Step 4 ఇప్పుడు అందులోనే ముందుగా ఉడికించి, పొట్ట తీసిన బంగాళదుంపులు, గుడ్లను వేసి మిక్స్ చేయాలి. వీటితోబాటు కారం, గరంమసాలా, పసుపు, ధనియాలపొడి వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. Step 5 చివరగా సరిపడా నీళ్లు, రుచికి తగ్గ ఉప్పు వేసి మరో 10 నిముషాలు వేయించాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే! స్పెషల్ ఎగ్-పొటాటో కర్రీ రిసిపీ రెడీ!
Yummy Food Recipes
Add