mango ice cream recipe making tips By , 2014-12-22 mango ice cream recipe making tips mango ice cream recipe making tips : the simple cooking tips to make mango ice cream which is healthy and tasty than other. Prep Time: 20min Cook time: 15min Ingredients: 2 కప్పులు మామిడిపండు ముక్కలు, 2 కప్పులు పంచదార, 5 కోడిగుడ్లు (పచ్చసొన), 1 కప్ క్రీమ్, 2 కప్స్ పాలు, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, Instructions: Step 1 ఒక గాజు పాత్ర తీసుకుని అందులో మామిడి ముక్కలు, పంచదార, నిమ్మరసం తదితర పదార్థాలను వేసి కలుపుకోవాలి. తర్వాత పాత్రకు మూతపెట్టి రెండుగంటలపాటు ఫ్రిజ్’లో వుంచాలి. Step 2 అనంతరం పాలు కలిపిన కస్టర్డ్’ను తయారుచేసుకోవాలి. ఒక పాత్రలో గుడ్డుసొనను గిలక్కొట్టి, అందులో కొద్దిగా పంచదార వేసి కలుపుకోవాలి. అనంతరం అందులో వేడిగా వున్న పాలు పోసి బాగా గిలక్కొట్టుకోవాలి. Step 3 ఇలా కలుపుకున్న అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక పాన్’లో వేసి స్టౌవ్ మీద పెట్టి మీడియం మంట మీద వేడి చేయాలి. దానికి మూతపెట్టకుండా చెక్క, గరిటెకు బాగా అంటుకునేవిధంగా చిక్కబడేవరకు అలానే వుంచాలి. Step 4 ఇలా కలిపిన అనంతరం ఇందులో ఇదివరకు ఫ్రిజ్’లో పెట్టిన మిశ్రమాన్ని కలుపుకోవాలి. చివరగా కలిపిన మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్’లోకి వడబోసుకోవాలి. అంతే! మ్యాంగో ఐస్’క్రీమ్ రెడీ!
Yummy Food Recipes
Add