spanish ice cream making tips By , 2014-12-22 spanish ice cream making tips spanish ice cream making tips : the simple cooking tips to make spanish ice cream which has different taste. It is easy to make and serve. Prep Time: 25min Cook time: 20min Ingredients: 250 మి.లీ. పాలు, 1-2 కోడిగుడ్లు, 500 మి.లీ. క్రీమ్, 1-2 దాల్చిన చెక్క (పెద్దది), 300 గ్రాములు చక్కెర, 1-2 నిమ్మకాయ, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక శుభ్రమైన పాత్రను స్టౌవ్ మీద పెట్టి.. అందులో పాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ (కేవలం రసాన్ని కాకుండా మొత్తాన్ని వేసేయాలి), చక్కెర తదితర పదార్థాలు వేసి వేడి చేయాలి. పాలు బాగా మరిగిన అనంతరం ఆ పాత్రను కిందకు దించేసి ఓ గంటసేపటివరకు చల్లార్చనివ్వాలి. Step 2 మరోవైపు ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన వేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి. ఈ గిన్నెను చల్లని నీళ్లు వున్న గిన్నెలో వుంచితే.. కొద్దిసేపటి తర్వాత సొన చిక్కబడుతుంది. Step 3 ఇప్పుడు ఇదివరకు మరిగించి, చల్లార్చిన పాలల్లోనుంచి దాల్చిన చెక్క, నిమ్మచెక్కలను తీసేసి.. అందులో కోడిగుడ్ల సొనను వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌ మీద వుంచి, మీడియం మంటమీద కలుపుతూ ఉడికించాలి. Step 4 ఆ పాలమిశ్రమం బాగా చిక్కబడిన తర్వాత దానిని క్రిందకు దించేసి.. అందులో క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం దీన్ని కొద్దిసేపటివరకు ఫ్రిజ్’లో పెట్టేయాలి. Step 5 ఆ మిశ్రమం ఫ్రిజ్’లో గట్టిగా అయిన తర్వాత బయటకు తీసి రుబ్బుకోవాలి. అనంతరం మళ్లీ ఫ్రిజ్’లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఐస్’క్రీమ్, మెత్తగా, మృదువుగా తయారవుతుంది. ఇలా మూడుసార్లవరకు చేయాలి. అంతే! స్పానిష్ ఐస్’క్రీమ్ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day