sev kamadi By , 2018-05-31 sev kamadi Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sev kamadi making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: సెనగపప్పు కప్పు,ఉ ప్పు తగినంత,వంటసోడా చిటికెడు,నిమ్మఉప్పు చిటికెడు,పంచదార కొద్దిగా,నిమ్మకాయ ఒకటి,నూనె రెండు చెంచాలు,జీలకర్ర చెంచా,సెనగపప్పు చెంచా,సన్నని సేవ్, కొత్తిమీర తరుగు, కొబ్బరితురుము అలంకరణకోసం, Instructions: Step 1 ఈ వంటను మనం వంటింటిలో వాడే శనగపప్పుతో తయారుచేసుకోవాలి. సేవ్ కమడీ తయారు చేయాలంటే ముందుగా శనగపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి. Step 2 ఆ తరవాత నీళ్లు ఒంపేసి గట్టి పిండిలా రుబ్బుకోవాలి Step 3 ఇందులో పంచదార, ఉప్పు, వంటసోడా, నిమ్మఉప్పు వేసి బాగా కలపాలి. Step 4 ఈ పిండిని ఇడ్లీ పాత్రల్లోకి తీసుకుని ఆవిరిమీద ఉడికించి ముక్కల్లా కోయాలి.  Step 5 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, సెనగపప్పును వేయించి ఈ మిశ్రమం పై వేయాలి Step 6 చివరగా నిమ్మరసం చల్లాలి. పైన అలంకరణ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలను చల్లితే కమ్మని సేవ్ కమడి చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day