mutton pulao recipe making tips healthy food weekend special item By , 2014-12-20 mutton pulao recipe making tips healthy food weekend special item mutton pulao recipe making tips healthy food weekend special item : the simple cooking tips to make mutton pulao recipe which contains healthy ingredients like zink, iron and many more. Prep Time: 50min Cook time: 40min Ingredients: 1 కేజీ మటన్, 3/4 కేజీ బాస్మతి రైస్, 1/2 కప్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ టమోటా తరుగు, 1/2 కప్ వెల్లుల్లి తరుగు, 1/2 కప్ నెయ్యి, 1 కప్ కొత్తిమీర, పుదీనా, 1/2 కప్ బటర్, 1/2 టీ స్పూన్ గరంమసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 లీటర్ పాలు, 1/2 టీ స్పూన్ క్రీమ్, 4 టీ స్పూన్ నిమ్మకాయం రసం, కొద్దిగా కుంకుమపువ్వు, తగినంత పసుపు, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 మొదటగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే బాస్మతి బియ్యాన్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరోవైపు గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకోవాలి. Step 2 ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో వెన్న వేసి వేడి చేయాలి. వెన్న కాగిన అనంతరం అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి.. బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేయించాలి. Step 3 ఉల్లి రంగు మారిన తరువాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి తదితర పదార్థాలు వేసి.. పచ్చివాసన పోయేంతవరకు వేడి చేసుకోవాలి. ఈ మసాలా ఉడికేందుకు వీలుగా తగినంత నీళ్లు పోసుకోవాలి. Step 4 మసాలా బాగా ఉడికిన అనంతరం అందులో తరిగిన టమోటాలు, మసాలాపొడి, కొత్తిమీరి ఆకులు, రుచికి తగినంత ఉప్పు కలపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కాస్త వేడి చేసుకున్న అనంతరం మటన్ ముక్కలు వేసి.. అవి మెత్తబడేవరకు ఉడికించాలి. Step 5 మటన్ ముక్కలు మెత్తబడిన తర్వాత ఈ మసాలా మిశ్రమంలో అందులో కొద్దిగా కుంకుమపువ్వు నానబెట్టిన పాలు, కొద్ది నిమ్మరసాన్ని కలుపుకోవాలి. Step 6 మరొక పెద్ద పాత్రను తీసుకుని అందులో నీరు పోసి స్టౌవ్ మీద ఉడికించాలి. నీరు బాగా కాగిన తర్వాత అందులో బియ్యం వేయాలి. సగం ఉడికిన తర్వాత నీళ్లను పూర్తిగా వడకట్టేసి.. అన్నంపై ఇదివరకు ఫ్రై చేసుకున్న మటన్ ముక్కల మసాలాను పరవాలి. Step 7 అనంతరం కుంకుమపువ్వు కలిపిన పాలు, క్రీమ్, వెన్న, గరం మసాలా, తరిగిన పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి... ఆ పాత్రపై మూతపెట్టి మీడియం మంటమీద ఉడికించాలి. Step 8 20 నిముషాలపాటు ఉడికించిన తర్వాత పాత్రను స్టౌవ్ మీద నుంచి క్రిందకు దించేయాలి. అంతే! ఘుమఘుమలాడే హెల్తీ మటన్ పలావ్ రెడీ!
Yummy Food Recipes
Add