Mixed Veg masala Paratha By , 2018-05-15 Mixed Veg masala Paratha Here is the process for Mixed Veg masala Paratha making .Just follow this simple tips Prep Time: 35min Cook time: 20min Ingredients: గోధుమపిండి - కప్పు,,వెన్న - అరకప్పు,,సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు - అరకప్పు,,క్యారెట్‌ తురుము - అరకప్పు,,ఉడికించి ముద్దలా చేసిన ఆలూ - కప్పు, కసూరీమేథీ - ఒకటిన్నర చెంచా,,కారం - అరచెంచా,,పచ్చిమిర్చి - రెండు,,గరంమసాలా - అరచెంచా,,ఉప్పు - తగినంత,,జీలకర్రపొడి - అరచెంచా., Instructions: Step 1 ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇది నానేలోగా కూర సిద్ధంచేసుకోవాలి. Step 2 బాణలిలో చెంచా వెన్న కరిగించి ఉల్లిపాయముక్కలు వేయించుకోవాలి. అవి దోరగా వేగాక క్యారెట్‌ తురుమూ, కసూరీమేథీ, ఆలూ ముద్ద వేసి బాగా కలపాలి.  Step 3 ఇది కూరలా తయారయ్యాక కారం, తగినంత ఉప్పూ, పచ్చిమిర్చి ముక్కలూ, గరంమాసాలా, జీలకర్రపొడీ కూడా వేసి కలిపి దింపేయాలి.  Step 4 కొద్దిగా చపాతీ ముద్దను తీసుకుని చిన్న చపాతీలా చేసి అందులో ఒకటిన్నర చెంచా కూరను ఉంచాలి.   Step 5 తరవాత అంచుల్ని మూసేసి నెమ్మదిగా పరోటాలా వత్తుకోవాలి. దీన్ని పెనంపై వేసి వెన్నతో రెండువైపులా కాల్చుకుంటే సరిపోతుంది.    Step 6 ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day