Masala Khichdi By , 2018-05-15 Masala Khichdi Here is the process for Masala Khichdi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: పెసరపప్పు, బియ్యం - అరకప్పు చొప్పున,,బీన్స్‌, ఆలూ, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు చొప్పున,,ఉప్పు - చెంచా,,పసుపు - పావుచెంచా,,వెన్న లేదా నెయ్యి - టేబుల్‌స్పూను,,బఠాణీలు - పావు కప్పు.,,తాలింపుకోసం: ,నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు,,జీలకర్ర - అరచెంచా,,ఆవాలు - అరచెంచా,,ఇంగువ - చిటికెడు,,టొమాటో ముక్కలు - కప్పు,,పచ్చిమిర్చి - రెండు,,కారం - పావుచెంచా,,ఉప్పు - తగినంత,,అల్లం తరుగు - రెండు చెంచాలు,,కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు.,గరంమసాలా - పావుచెంచా., Instructions: Step 1 ముందుగా పెసరపప్పూ, బియ్యాన్ని కడగాలి. తరవాత రెండున్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో తీసుకోవాలి.  Step 2 ఇందులో బీన్స్‌, ఆలూ, క్యారెట్‌ ముక్కలూ, బఠాణీలూ, కొద్దిగా ఉప్పూ, పసుపూ, వెన్న లేదా నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి.  Step 3 మూడుకూతలు వచ్చాక దింపేయాలి. తరవాత దింపేసి అన్నాన్ని ఓసారి కలపాలి.  Step 4 ఇప్పుడు బాణలిలో నెయ్యిని కరిగించి జీలకర్రా, ఆవాలూ, ఇంగువా వేసి వేయించాలి.   Step 5 అందులో పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, టొమాటో ముక్కలూ, కారం, కొద్దిగా ఉప్పూ వేసి బాగా కలపాలి.    Step 6 టొమాటో ముక్కలు ఉడికాక కొత్తిమీర తరుగూ, గరంమసాలా వేసి మంట తగ్గించేయాలి.    Step 7 ఇందులో వండిన పెసరపప్పు అన్నం వేసి కొద్దిగా నీళ్లూ పోయాలి. కాసేపటికి ఇది కిచిడీలా తయారవుతుంది. అప్పుడు దింపేయాలి.    Step 8 దీంతోపాటూ ఉల్లిపాయ పెరుగు పచ్చడి కలిపి వడ్డిస్తే సరి.          
Yummy Food Recipes
Add