chicken chilli ghee roast By , 2018-05-12 chicken chilli ghee roast Here is the process for chicken chilli ghee roast making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 30min Ingredients: చికెన్ - 600గ్రాములు (బోన్ లెస్ మరియు చిన్న ముక్కలుగా కట్ చేసినవి),పెరుగు - 4టేబుల్ స్పూన్లు,నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2టేబుల్ స్పూన్లు,పసుపు - చిటికెడు,బెల్లం లేదా పంచదార - 1 టేబుల్ స్పూన్లు,ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి),రుచికి సరిపడా ఉప్పు,కరివేపాకురెమ్మలు - 5,ఎండు మిర్చి - 10,జీలక్ర - ½ టీస్పూన్,మెంతులు - ¼th టీస్పూన్,దనియాలు - 1 టేబుల్ స్పూన్లు,పచ్చికొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు (రోస్ట్ చేసుకోవాలి),సోంపు - ½ టీస్పూన్,లవంగాలు - 2,దాల్చిన చెక్క - 2,నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్లు,చింతపండు గుజ్జు- ½ టీస్పూన్, Instructions: Step 1 ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి తక్కువ మంట మీద అన్ని రకాల మసాలాలు వేసి రోస్ట్ చేసుకోవాలి.  Step 2 అలాగే ఎండు మిర్చి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.వేయించుకున్న పదార్థాలు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి, అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాలు, పెరుగు, వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 4 మ్యారినేషన్ సమయంలోనే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ స్టౌమీద పెట్టి, నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి.    Step 5 తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేగించుకోవాలి.   Step 6 ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన చికెన్, వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే 1/4కప్పు నీళ్ళు జోడించి, చిక్కగా ఉడికించాలి. మరీ గ్రేవీలా కాకుండా చిక్కగా ఉండేట్లు చూసుకోవాలి.   Step 7 ఇప్పుడు, కొబ్బరి తురుము, చింతపండు పేస్ట్, బెల్లం, నెయ్యి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.    Step 8 అవసరమైతే అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవచ్చు. మొత్తం మిశ్రమాన్ని 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.   Step 9 అంతే చికెన్ చిల్లీ గీ రోస్ట్ రిసిపి రెడీ .వేడి వేడిగా వడ్డించడమే ఆలస్యం ఇష్టంగా తినేస్తారు.      
Yummy Food Recipes
Add