kakarakaya manjurian By , 2018-03-09 kakarakaya manjurian Here is the process for kakarakaya manjurian making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 20min Ingredients: కాకరకాయలు : పావు కేజీ,మైదా - ఒక కప్పు,కార్న్ ఫ్లోర్ - అర కప్పు,మిరప్పొడి - ఒక టీ స్పూన్,నిమ్మరసం - అర టీ స్పూన్,ఉల్లిపాయ తరుగు - పావు కప్పు,టమోటా తరుగు - పావు కప్పు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్,పసుపు - చిటికెడు,ఉప్పు - సరిపడా,నూనె - సరిపడా,టమోటా సాస్ - తగినంత,సోయాసాస్ - తగినంత, Instructions: Step 1 ముందుగా కాకరకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో కాసేపు ఉంచాలి.  Step 2 తర్వాత కాకర ముక్కలను వేరొక పాత్రలోకి తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం చేర్చి బాగా కలిపి పావు గంట నానబెట్టాలి.  Step 3 తర్వాత గ్యాస్ పైన బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక కాకర మిశ్రమాన్నివేసి దోరగా వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. Step 4 తరువాత ఇంకో పాత్రలో నూనె పోసి పోపు గింజలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమోటా తరుగు, టమోటా సాస్, సోయాసాస్, ఉప్పు, కారం, బాగా వేపుకుని దీంతో వేయించిన కాకరను చేర్చి బాగా కలపాలి.   Step 5 ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే వెరైటీ కాకరకాయ మంజూరియన్ రెడీ.              
Yummy Food Recipes
Add