jackfruit-rasam By , 2018-04-11 jackfruit-rasam Here is the process for jackfruit-rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పనగింజలు - 10 to 15,కొబ్బరి తురుము - 1 cup,జీలకర్ర - 1/2 cup,ఎండుమిర్చి - 4 to 5,ధనియాలు - 1/2 teaspoon,చింతపండు- Size of a lemon,బెల్లం- 1 teaspoon,పసుపు - 1/2 teaspoon,ఆవాలు - 1/2 teaspoon,ఉల్లిపాయలు - 1 Cup,టమోటోలు - 1 Cup,కొత్తిమీర - 1/2 cup,ఉపు: రుచికి సరిపడా నూనె సరిపడా, Instructions: Step 1 పనసగింజలను ఎండలో ఎండబెట్టాలి. (ఇలా చేయడం వల్ల పైపొట్టును సులభంగా తొలగించవచ్చు)  తర్వాత పససగింజలను రఫ్ గా పొడి చేసుకోవాలి Step 2 ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందలో డ్రై అయిన జాక్ ఫ్రూట్ పొడి వేసి సరిపడా నీళ్ళు పోయాలి. తర్వాత మూత పెట్టి, నాలుగైదు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల పనసగింజలు మెత్తగా అవుతాయి. Step 3 ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత, స్టౌ ఆప్ చేసి చల్లారనివ్వాలి. పనసగింజలు చాలా మెత్తగా ఉడికుండాలి. మెత్తగా ఉడికినట్లైతే వీటిని పక్కన పెట్టుకోవాలి  Step 4 ఇప్పుడు పాన్ తీసుకుని స్టౌ మీద పెట్టి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు మరియు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.  Step 5 లైట్ గా వేగించుకున్న వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోవేసి, వీటితోపాటు చింత పండు, బెల్లం మరియు కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.  Step 6 అలాగే ఈ మసాలా పేస్ట్ తో పాటు 5 జాక్ ఫ్రూట్(ఉడికించిన పనగింజలను)కూడా వేసి, అవసరమైతే నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 7 ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని అందులో నూనె వేసి వేగిన తర్వాత ఆవాలు, ఉల్లిపాయలు మరియు టమోటోలు కూడా వేసి వేగించుకోవాలి. Step 8 తర్వాత వేగుతున్న మిశ్రమంలో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి వేగించుకోవాలి తర్వాత సరిపడా నీళ్ళు, మొత్తం మిశ్రమం కలగలిపి, అందులోనే కొత్తిమీర తరుగు గార్నిషింగ్ గా వేసి 5-10నిముషాలు ఉడికించుకోవాలి. Step 9 అంతే వేడి వేడి, స్పైసీ జాక్ ఫ్రూట్ రసం రెడీ.  Step 10 ఈ రసంతో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే అద్భుతమైన రుచి ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day