Bread upma recipe By , 2017-03-20 Bread upma recipe Here is the process for Bread upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ స్లైసులు - 5,వేరుశెనక పప్పులు -1 టేబుల్ స్పూన్,జీల కర్ర -1/2 టీస్పూన్,నూనె లేదా బటర్ -3 టేబుల్ స్పూన్స్,క్యారెట్ -1,టమాటా -1,పచ్చిబఠాణి -1 టేబుల్ స్పూన్,ఉల్లిపాయ -1(చిన్నది),పచ్చిమిర్చి -2,చాట్ మసాలా -1/2 టీస్పూన్,డ్రై మ్యాంగో పొడి -1/2 టీ స్పూన్,ఉప్పు -తగినంత,కొత్తిమీర -కొద్దిగా,మిక్సర్ -కొద్దిగా, Instructions: Step 1 ముందుగా బ్రెడ్ ని చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, టమాటా ,పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి.  Step 3 తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు దోరగా వేయించుని పక్కన పెట్టుకోండి. Step 4 అదే కడాయిలో మరి కొంచెం నూనె వేసి వేడి అయ్యాక ,జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు వేయించుకుని ,తరువాత టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మరో 3 నిమిషాలు మగ్గించుకుని ,చాట్ మసాలా,మ్యాంగో పొడి వేసి కలుపుకోవాలి.  Step 5 ఎక్కువ నీరు లేకుండా కూరని వేయించుని చివరగా బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర వేసుకుని కలిపి ప్లేటులోకి తీసుకుని మిక్సర్ వేసి, నిమ్మరసం చల్లుకుని తింటే చాల రుచిగా ఉంటుంది.    
Yummy Food Recipes
Add