tomato-garlic-chutney By , 2018-04-10 tomato-garlic-chutney Here is the process for tomato-garlic-chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సన్నగా తరిగిన టమాటాలు-ఒక కప్పు,సన్నగా తరిగిన వెల్లుల్లి-ఒక టేబుల్ స్పూను,నూనె-ఒక టేబుల్ స్పూను,ఉల్లి కాడల తరుగు(తెల్ల భాగం)-పావు కప్పు,ముందర నీళ్ళల్లో నానబెట్టుకుని సన్నగా తరిగిన కాశ్మీరీ మిరప పళ్ళు-2,టమాటా కెచప్-ఒక టేబుల్ స్పూను,ఉల్లి కాడల తరుగు(ఆకు పచ్చని భాగం)- ఒక టేబుల్ స్పూను,సన్నగా తరిగిన కొత్తిమీర-ఒక టేబుల్ స్పూను,ఉప్పు-రుచికి తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక మూకుడులో నూనె వేడి చేసి ఉల్లికాడల తెల్ల భాగం వేసి వేయించాలి.  Step 2 దీనికి వెల్లుల్లి తరుగు వేసి బాగ కలపాలి. ఎక్కువగా వేయించకూడదు సుమా. లేదంటే చట్నీ చేదెక్కే ప్రమాదం ఉంది.  Step 3 ఇప్పుడు నానబెట్టి సన్నగా తరిగిన కాశ్మీరీ మిర్చి వేసి కాస్త వేగాకా టమాటా తరుగు కూడా కలిపి బాగా వేగనివ్వాలి.  Step 4 ఒకవేళ ఈ మిశ్రమం బాగా గట్టిగా ఉంటే టమాటాలు ఉడకడానికి కాసిని నీళ్ళు చల్లి స్టవ్ మంట పెద్దగా పెట్టి కాసేపు ఉడకనివ్వండి.   Step 5 టమాటాలు ఉడికేటప్పుడు గరిటెతో చిదమడం మర్చిపోవద్దు.ఇప్పుడు ఈ టమాటా మిశ్రమానికి టమాటా కెచప్ కలపాలి. టమాటా కెచప్ చట్నీకి కాస్త తీపి-పులుపు రుచిని తీసుకొస్తుంది.    Step 6 ఇప్పుడు అన్నింటినీ మరొక్కసారి బాగా కలిపి స్టవ్ ఆపాలి.    Step 7 చట్నీ పూర్తిగా చల్లారాకా ఉల్లికాడల ఆకుపచ్చని భాగం, కొత్తిమీర వేసి గార్నిష్ చెయ్యడమే. అంతే, టమాటా వెల్లుల్లి చట్నీ తయారయిపోయింది. దీనిని సమూసాలు, పకోడీలకి జతగా మీ అతిధులకి వడ్డించండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day