jalebi By , 2018-04-04 jalebi Here is the process for jalebi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా - 1 కప్పు,శనగ పిండి - 1 టేబుల్ స్పూన్,తాజా పెరుగు - 1 కప్పు,చక్కెర - 1 కప్పు,నీరు - 4 కప్పులు,కుంకుమ పువ్వు - 4-5 రేకలు,ఫ్రూట్ సాల్ట్ - చిటికెడు,కుంకుమ పువ్వు రంగు - చిటికెడు,నెయ్యి - 1 కప్పు, Instructions: Step 1 బౌల్ లోకి మైదా పిండి తీసుకోవాలి దానికి శనగపిండి మరియు తాజా పెరుగు కలపాలి ఉండలు లేకుండా మందపాటి పేస్ట్ గా కలపాలి కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.  Step 2 ఈ లోపు పొయ్యి మీద పాన్ పెట్టి పంచదార వేయాలి పంచదారలో నీరు పోయాలి. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి.  Step 3 కుంకుమ పువ్వు మరియు ఫుడ్ కలర్ కలపాలి తక్కువ మంట మీద బాగా కలపాలి పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలపాలి ప్లాస్టిక్ స్క్వీజ్ బాటిల్ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి.  Step 4 బాటిల్ లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్ కి నాజిల్ ఉన్న మూతను పెట్టాలి పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిముషాలు వేడి చేయాలి నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్ తీసుకొని బాటిల్ ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి.  Step 5 జిలేబి రౌండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి రెండు వైపుల గోల్డ్ కలర్ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి. బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.  Step 6 ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి వేడి వేడి జిలేబీలకు సర్వ్ చేయండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day