lemon-rice By , 2018-04-04 lemon-rice Here is the process for lemon-rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: నూనె - 8 టేబుల్ స్పూన్లు,వేరు శనగ - ½ కప్పు,ఆవాలు - 1 స్పూన్,జీలకర్ర - 1 స్పూన్,ఉల్లిపాయలు (సన్నగా మరియు పొడవైన ముక్కలు) - 1 కప్పు,పచ్చి మిరపకాయలు (చీరికలుగా కోయాలి) - 4,పచ్చి శనగ పప్పు - 2 స్పూన్,కాప్సికమ్ (క్యూబ్ ఆకారంలో కోయాలి) - 1 కప్పు,రుచికి సరిపడా - ఉప్పు,పసుపు పొడి - ½ స్పూన్,కొత్తిమీర (తరిగినది ) - ½ కప్పు,నిమ్మ రసం - అర చెక్క,రైస్ - ½ బౌల్,నీరు - 1 బౌల్, Instructions: Step 1 కుక్కర్ లో బియ్యం పోయాలి నీరు మరియు రెండు స్పూన్ల ఉప్పు కలపాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పాన్ పొయ్యి మీద పెట్టి నూనె పోయాలి.  Step 2 దానిలో వేరుశనగ గుళ్ళు వేసి మంచి వాసన, రంగు వచ్చేవరకు వేగించాలి. పాన్ నుండి వేగిన వేరుశనగ గుళ్లను ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన నూనెలో ఆవాలు వేసి చిటపట లాడేవరకు వేగించాలి. ఆ తర్వాత జీలకర్ర మరియు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.  Step 3 ఒక నిమిషం వేగించాలి.  ఇప్పుడు చీరికలుగా కోసిన పచ్చి మిరప ముక్కలు,శనగపప్పు వేయాలి.  ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత కాప్సికం వేసి బాగా కలపాలి.  Step 4 ఉప్పు మరియు పసుపు పొడి కలపాలి. 5 నుంచి 6 నిమిషాల వరకు వేగించాలి. అంటే కాప్సికం సగం ఉడికే వరకు వేగించాలి. వేగించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు మరియు తరిగిన కొత్తిమీర వేయాలి. Step 5 బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. 17. 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా చల్లారబెట్టాలి నిమ్మరసం వేసి బాగా కలపాలి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపాలి.  Step 6 సర్వింగ్ బౌల్ లోకి తీసుకోని సర్వ్ చేయండి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day