Vegetable Paratha By , 2017-11-10 Vegetable Paratha Here is the process for Vegetable Paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: గోధుమపిండి : 1 కప్పు,బంగాళాదుంప : 1,క్యారెట్ ముక్కలు : అరకప్పు,కాలీఫ్లవర్ ముక్కలు : పావుకప్పు,పచ్చి బఠాణీ : పావుకప్పు,సన్నగా తరిగిన పాలకూర : పావుకప్పు,కొత్తిమీర : పావుకప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్ : అరచెంచా,కారం : అరచెంచా,గరం మసాలా : అరచెంచా,వాము : అరచెంచా,ఉప్పు : తగినంత,నూనె లేక నెయ్యి : కాల్చుకోడానికి సరిపడా, Instructions: Step 1 గోధుమపిండిలో నీళ్లు వేసి చపాతీపిండి మాదిరిగా కలిపి, ఓ అరగంట పాటు అలా వదిలేయాలి.  Step 2 ఈలోపు బంగాళాదుంపను ఉడికించి, తొక్క తీసి, మెత్తగా చిదుముకోవాలి.  Step 3 మిగతా కూరగాయలన్నికీ నీటిలో వేసి మెత్తబడేవరకూ ఉడికించాలి.  Step 4 తర్వాత వాటన్నిటికీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.   Step 5 బంగాళాదుంప, కూరగాయల ముద్దలో నూనె/నెయ్యి తప్ప మిగతా పదార్థాలన్నిటినీ వేసి కలపాలి.    Step 6 గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి.   Step 7 దీని మధ్యలో పై మిశ్రమాన్ని పెట్టి, అన్ని వైపుల నుంచీ మూసివేసి, మళ్లీ ఉండ చుట్టాలి.    Step 8 దీన్ని మళ్లీ ఒత్తుకుని నూనె లేక నెయ్యి వేసి కాల్చుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day