egg-fried-rice By , 2018-03-31 egg-fried-rice Here is the process for egg-fried-rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రైస్ - 1½ కప్పు,నీరు - 3 కప్స్,ఉప్పు - 1 టీ స్పూన్ + 1 టీ స్పూన్ + 1 టీ స్పూన్,ఉల్లిపాయ - 1,పచ్చిమిరపకాయలు - 2,క్యారెట్ - 1,కాప్సికమ్ - 1/2,కొత్తిమీర ఆకులు - 1/4 కప్పు +,అలంకరించడానికి కొద్దిగా వెన్న - 1,టేబుల్ స్పూన్,గుడ్లు - 3,పెప్పర్ - 1 టీస్పూన్లు + టీ 2 స్పూన్లు,నూనె - 3 టేబుల్ స్పూన్లు,వెల్లుల్లి రెబ్బలు - 4 (తరిగిన),అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్,వెన్న - 1 టేబుల్ స్పూన్, Instructions: Step 1 గిన్నెలో బియ్యం వేసి పూర్తిగా శుభ్రం చేయాలి.  కడిగిన బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేయాలి కప్పుల నీరు జోడించండి. ఒక టీస్పూన్ ఉప్పు వేసి మూత పెట్టాలి. 2 విజిల్స్ వచ్చే వరకు రైస్ ను ఉడికించాలి అంతలోపు, ఒక ఉల్లిపాయ తీసుకొని దాని పైభాగంలో మరియు దిగువ భాగాలను కట్ చేయాలి. ఉల్లిపాయ పొట్టును పూర్తిగా తొలగించి, మద్యలో సగానికి కట్ చేయాలి.  Step 2 అవసరమైతే ఉల్లిపాయ పైభాగంలో గట్టిగా ఉన్న భాగాన్ని కట్ చేసి తొలగించండి తర్వాత, దీన్ని సన్నగా పల్చగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకుని సగానికి కట్ చేయాలి. తర్వాత వాటిని మద్యలోకిన రెండు అంగుళాల పొడవున కట్ చేయాలి ఒక క్యారెట్ తీసుకోండి. దాని పైభాగంలో మరియు దిగువ భాగాలను కట్ చేయండి క్యారెట్ పైన తొక్కను పీలర్ తో తొలగించండి.  Step 3 తర్వాత రెండు గా కట్ చేసి, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి క్యాప్సికమ్ తీసుకొని సగానికి కట్ చేయాలి అలాగే క్యాప్సికమ్ పై భాగాన్ని కూడా కట్ చేయండి క్యాప్సికమ్ లోపల విత్తనాలతో ఉన్నటువంటి తెల్లటి భాగాన్ని తొలగించండి.  Step 4 తర్వాత సగం క్యాప్సికం మాత్రమే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి  క్యాప్సికం చివరన కట్ చేసిన తొడిమ వరకూ కట్ చేసుకోవచ్చు.  1/4 కప్పు కొత్తిమీర తీసుకుని, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడిచేసిన సాస్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసి, వెన్న కరగనివ్వాలి.    Step 5 ఒక్కో గుడ్డును చేతిలోకి తీసుకుని కత్తితో పాన్లోకి ఒకదాని తర్వాత మరొకటి గుడ్లు బ్రేక్ చేయాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక టీస్పూన్ మిరియాలు పొడి వేయాలి. పచ్చిగా ఉన్న గుడ్డు బాగా విడిపోయియో వరకూ వేగిస్తూ గరిటతో విడగొడుతూ వేయించాలి  గుడ్డు మిశ్రమం మాడి పోకుండా మద్యమద్యలో గరిటతో కలుపూ ఉండాలి గుడ్డు బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.  ఇప్పుడు అదే పాన్ ను ఉపయోగించడం వల్ల గుడ్డు వాసన అలాగే ఉంటుంది.    Step 6 అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని విడివిడిగా గరిటతో వేరుచేస్తూ వేగించాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేయాలి.    Step 7 ఒక టీస్పూన్ అల్లం మరియు వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి  ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేయాలి 2 నిముషాలు బాగా వేయించాలి కట్ చేసిన క్యాప్సికం ముక్కలను , అలాగే ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి.  మొత్తం మిశ్రమం కలిపిన రెండు నిముషాల తర్వాత ముందుగా వండుకున్న అన్నం వేయాలి.   Step 8 మరో రెండు స్పూన్ల మిరియాల పొడి కలిపి మొత్తం మిశ్రమాన్ని కలగలపాలి. అలాగే కొద్దిగా బటర్ వేయడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుంది.  చివరగా, ఫ్రై చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించాలి ఒక గిన్నెలో తీసుకుని , వేడి వేడిగా వడ్డించండి.          
Yummy Food Recipes
Add