stuffed bhindi recipe By , 2016-10-31 stuffed bhindi recipe South special stuffed bhindi recipe. Prep Time: 30min Cook time: 25min Ingredients: అరకేజీ బెండకాయలు,తగినంత నూనె: తగినంత,ఒక కప్పు శనగలు స్టఫింగ్ కోసం (ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి), 2 టేబుల్ స్పూన్ల పల్లీలు(వేయించాలి),1 టేబుల్ స్పూన్ నువ్వులు(వేయించాలి),ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు(వేయించాలి),రెండు స్పూన్ల పచ్చి మిర్చి ముద్ద,2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద,పావు టీస్పూన్ పసుపు,రెండు స్పూన్ల నిమ్మరసం,రెండు కట్టల కొత్తమీర ,రుచికి సరిపడంతా ఉప్పు , Instructions: Step 1 వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వులు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి. Step 2 తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా సిద్దం చేసి ఉంచుకున్న శనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి. Step 3 బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. (బెండకాయ ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి) Step 4 ముందుగా తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయాలి. Step 5 తర్వాత వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి. Step 5 స్టఫ్ బెండకాయ 10నిముషాలు ఉడికిన తర్వాత పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. Step 5 అంతే స్టఫ్డ్ బెండీ రెడీ. ఇది వేడి రైస్, చపాతీలకు చాలా టేస్ట్ గా ఉంటుంది.
Yummy Food Recipes
Add