Vakkaya Pachadi By , 2017-01-18 Vakkaya Pachadi here is the making process for Vakkaya Pachadi Prep Time: 30min Cook time: 15min Ingredients: వాక్కాయలు - పావుకిలో, ,పల్లీలు  - 100 గ్రాములు, ,ఎండు మిరపకాయలు - 10 ,వెల్లుల్లి రేకలు - 6,కొత్తిమీర కట్ట -1,కరివేపాకు  - ఒక రెబ్బ, ,జీలకర్ర  - ఒక టీ స్పూను, ,ఉప్పు,ఇంగువ,  నూనె  -సరిపడా, Instructions: Step 1వాక్కాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసి వేగించుకుని తీసెయ్యాలి.  Step 2తరువాత మళ్లీ కొద్దిగా నూనె పోసి వేడెక్కాక వాక్కాయలు వేసి వేగించాలి. బాగా వేగాక కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. చల్లారాక వీటన్నింటినీ రోట్లో వేసి వేసి రుబ్బుకోవాలి. తరువాత పచ్చడి తాలింపు పెట్టుకోవాలి Step 3చివర్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యివేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day