vada recipe By , 2018-03-17 vada recipe Here is the process for vada making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 20min Ingredients: పచ్చిశనగపప్పు - కప్పు,,ఉల్లిపాయలు (చిన్న ముక్కలుగా కట్‌ చేసినవి) - అరకప్పు,,కొత్తిమీర, పుదీనా తరుగు - కప్పు,,పచ్చిమిర్చి - ఐదు లేక ఆరు,,అల్లం - చిన్న ముక్క,,వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు,,లవంగాలు- నాలుగు,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - వేయించడానికి తగినంత., Instructions: Step 1 ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రం చేసి మూడు నాలుగు గంటలసేపు నానబెట్టుకోవాలి.  Step 2 అంతలోపు ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరిగి పక్కన పెట్టుకోవాలి.  Step 3 తర్వాత మిక్సీజార్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.  Step 4 ఈ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకొని అదే జార్‌లో నానబెట్టుకున్న శనగపప్పును బరకగా, కొంత భాగం మెత్తని పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి.    Step 5 గ్రైండ్‌ చేసుకున్న పప్పును మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపాలి.    Step 6 అలాగే అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.   Step 7 ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్‌ పెట్టి, నూనె పోసి వేడయ్యాక, మసాలా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.    Step 8 వీటిని అరచేతిలో పెట్టి వడలుగా కావాల్సిన సైజులో వత్తుకొని వీటిని కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.    Step 9 వేడివేడిగా సర్వ్‌ చేయాలి. వీటికి పుదీనా చట్నీ కూడా మంచి కాంబినేషన్‌.      
Yummy Food Recipes
Add