Aloo bonda recipe By , 2017-05-25 Aloo bonda recipe Here is the process for Aloo bonda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బంగాళాదుంపలు - అర కిలో,నూనె - వేయించడానికి సరిపడా,సెనగ పిండి - అరకిలో,బియ్యప్పిండి - కప్పు,కొత్తిమీర - కొద్దిగా,పూదీన తురుము - కొద్దిగా,కరివేపాకు తురుము - కొద్దిగా,అల్లం వెల్లుల్లి - 2 టీస్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా,జీలకర్ర - అర టీస్పూన్,పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు,ఆవాలు - ఒక టీస్పూన్,కేసరి ఫుడ్ కలర్ - పావుటీస్పూన్,వంట సోడా - పావుటీస్పూన్,నిమ్మరసం - అర టీస్పూన్, Instructions: Step 1 బంగాళాదుంపలు ఉడికించి ఆరనివ్వాలి. తరువాత తోకకు తీసి బాగా చిదమాలి.  Step 2 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తురుము వేసి దోరగా వేగనివ్వాలి.  Step 3 అందులో పసుపు, అల్లం, పచ్చిమిర్చి గుజ్జు వేసి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి.  Step 4 ఇప్పుడు చిదిమిన బంగాళాదుంపలు వేసి ఉప్పు చల్లి కలుపుతూ పొడిపొడిగా వేగనివ్వాలి.    Step 5 అనంతరం కొత్తిమీర, పూదీన వేసి బాణలిను కిందకు దించి నిమ్మరసం కలపాలి.    Step 6 ఒక లోతైన గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, కేసరి రంగు, వంట సోడా, తగినంత ఉప్పు వేసి నీరు పోసి, గట్టి పెరుగులా పిండిని కలిపి ఉంచాలి.   Step 7 ఆలుగడ్డల మిశ్రమాన్ని లడ్డులంత సైజ్ లో ముద్దలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి.    Step 8 బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ముద్దలుగా చేసిన ఆలుగడ్డల మిశ్రమాన్ని పిండిలో ముంచి నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.    Step 9 అంతే ఆలూ బోండాలు రెడీ. ఇవి పచ్చిమిర్చి పచ్చడి, టమాటో సాస్ తో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day