variety fish curry By , 2018-03-14 variety fish curry Here is the process for variety fish curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేపలు - అరకేజీ,చింతపండు - కొద్దిగా,పచ్చిమిర్చి తరుగు- రెండు టీ స్పూన్లు,ఉల్లి తరుగు - పావు కప్పు,కారం - ఒక టేబుల్ స్పూన్,ఉప్పు, నూనె - తగినంత,యాలకులు, లవంగం, దాల్చిన చెక్క- ఒక స్పూన్,వెల్లుల్లి, అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్,కొత్తిమీర తరుగు- పావు కప్పు,ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్,జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్,గసగసాల పొడి - ఒక టేబుల్ స్పూన్, Instructions: Step 1 ముందుగా గ్రేవీ బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసిన చేపముక్కలు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. Step 2 అందులోనే పచ్చిమిర్చి, కారం, ధనియాలపొడి, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. Step 3 తర్వాత మరో పాన్‌లో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగం, యాలకుల పేస్ట్‌ను వేసుకోవాలి. ఇందులోనే చేపల ముక్కల మిశ్రమాన్ని కలపాలి. Step 4 మంటను బాగా తగ్గించి చేప ముక్కల్ని కాసేపు ఉడికించాలి.    Step 5 ఉడికే ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పెట్టుకోవాలి.   Step 6 ఈ గ్రేవీ మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి.    Step 7 చేపలు ఉడికిన తర్వాత కరివేపాకు, చింతపులుసు పోసి ఉడికించుకోవాలి.   Step 8 చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఫిష్ కర్రీ రెడీ.          
Yummy Food Recipes
Add