mutton kima By , 2018-03-10 mutton kima Here is the process for mutton kima making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ ఖీమా - అర కేజీ,ఉల్లి తరుగు - ఒక కప్పు,టమాటో తరుగు - ఒక కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు టీ స్పూన్లు,గరం మసాలా - ఒక టీ స్పూన్,కరివేపాకు - మూడు రెబ్బలు,కొత్తిమీర తరుగు- పావు కప్పు,పసుపు- చిటికెడు.,కారం, ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా ఖీమాను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లి తరుగును చేర్చి దోరగా వేయించాలి. Step 2 తర్వాత కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కొద్దిగా వేపుకోవాలి. కడిగి పెట్టుకున్న ఖీమ వేసి అందులో కాసింత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టాలి. Step 3 అందులోని నీరంతా ఇగిరిపోయాక చిన్న ముక్కలుగా చేసుకున్న టమోటా, గరం మసాలా వేసి కలియబెట్టి.. రెండు కప్పులు నీరు చేర్చి ఖీమా మెత్తగా ఉడికేంతవరకు ఉంచారు. Step 4 నీరంతా ఇగిరిపోయాక కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని దించేయాలి. అంతే మటన్ ఖీమా కర్రీ రెడీ అయినట్లే. దీన్ని రోటీల్లోకి లేదా అన్నంలోకి సైడిష్‌గా వాడుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day