Chicken Biryaani By , 2018-02-16 Chicken Biryaani Here is the process for Chicken Biryaani making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 35min Ingredients: బాస్మతీ బియ్యం : 2 కప్పులు (ముందుగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి),చికెన్ : అర కిలో,ఉల్లిపాయ : ఒకటి పెద్దది (చిన్నవి 2),టమాటోలు : రెండు (ముక్కలుగా తరగాలి),అల్ల, వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్,కొతిమీర : పావు కప్పు తరిగినది,పొదినా : పావుకప్పు తరిగినది,పచ్చి మిరపకాయలు : 5 సన్నగా నిలువుగా చీల్చినవి,నూనె : 3 టీ స్పూన్లు,నెయ్యి : 3 టీస్పూన్లు,పెరుగు : పావు కప్పు,నీళ్ళు : నాలుగున్నర కప్పులు,ఉప్పు : తగినంత,కారం : 2 టీ స్పూన్లు,జిలకర్ర పౌడర్ : 1 టీస్పూను,పసుపు : పావు స్పూను,చికెన్ కు పట్టించే మషాల కోసం :,ఉప్పు : పావు స్పూను,నిమ్మరం, పెరుగు : 2 స్పూన్లు,పసుపు : పావు స్పూను,ధనియాల పౌడర్: 1 టీస్పూను,గరం మసాలా : 1 టీ స్పూను,మిరియాల పౌడర్ : అర స్పూను,కారం : 1 స్పూను,అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూను,గరమ్ మసాలా కోసం,బిర్యానీ ఆకులు : 2,దాల్చిన చెక్క : 4 ముక్కలు,ఏలకులు : 3,లవంగాలు : 5,జాపత్రి : 2, Instructions: Step 1 చికెన్ శుభ్రం చేసికొని చిన్న ముక్కలుగా కోయాలి. చికెన్ కు పట్టించే మషాల దినుసులను మెత్తగా గ్రైండ్ చేసి చికెన్ కు పట్టించి ఒక గంట సేపు రెఫ్రిజరేటర్ లో ఉంచాలి.  Step 2 బియ్యంను కడిగి 15 ని. పాటు నానపెట్టి వడపోయాలి. అడుగు మందంగా గల వెడల్పాటి పాత్రలో నూనె, నెయ్యు వేసి వేడి చేయాలి. Step 3 గరం మసాలాలో చెప్పిన వస్తువులు మీ ఇష్టాన్ని బట్టి అలాగే కానీ లేక మొత్తం పొడిగా చేసి కాని వేయాలి . తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి.  Step 4 ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చేదాకా వేయించి తరిగిన కొత్తిమీర, పొదీనా ఆకులు వేసి కలపాలి.    Step 5 తరువాత తరిగిన టమాటో ముక్కలు కలపాలి. తరువాత ఫ్రిజ్లో ఉంచిన చికెన్, పసుపు,కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, ఉప్పు వేసి 5 నుండి 10 ని.ల సేపు ఉంచి నానబెట్టిన బియ్యం కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి.          
Yummy Food Recipes
Add