beetroot curry By , 2018-01-30 beetroot curry Here is the process for beetroot curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీట్‌రూట్‌ : పావు కేజీ,పెసరపప్పు : రెండు స్పూన్లు,పచ్చికొబ్బరి : ఒక చిప్ప,పచ్చిమిర్చి : ఏడు,ఉప్పు : సరిపడ,పసుపు: కొద్దిగ,పోపు గింజలు : రెండు స్పూన్లు,నూనె : ఐదు స్పూన్లు, Instructions: Step 1 పెసర పప్పు నానబెట్టాలి. Step 2 బీట్‌రూట్‌ పై చెక్కు తీసి నీటిలో బాగా కడిగి తురుముకోవాలి. Step 3 కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. Step 4 స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి పోపు గింజలు, కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ వేసి సన్నని మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి.   Step 5 ఉడికిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.   Step 6 ఇప్పుడు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు కలిపి దింపుకోవాలి.          
Yummy Food Recipes
Add