senagala payasam By , 2018-01-21 senagala payasam Here is the process for senagala payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చిన్న సెనగలు - కప్పు,,నెయ్యి - టేబుల్‌స్పూను,,కొబ్బరిముక్కలు,,జీడిపప్పు పలుకులు - పావుకప్పు,,పాలు,,బ్బరిపాలు - కప్పు చొప్పున,,కొబ్బరితురుము - పావుకప్పు,,బియ్యప్పిండి - టేబుల్‌స్పూను,,బెల్లం తురుము - కప్పు,,యాలకులపొడి - చెంచా,,పాలు - టేబుల్‌స్పూను., Instructions: Step 1 సెనగల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు నీళ్లు వంపేసి మరీ మెత్తగా కాకుండా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.  Step 2 బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కొబ్బరిముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి.  Step 3 అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి సెనగల ముద్ద వేసుకుని వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత పాలు పోసి మంట తగ్గించాలి.  Step 4 అది ఉడికిందనుకున్నాక బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం కరిగేలోగా.. విడిగా తీసిపెట్టుకున్న టేబుల్‌స్పూను పాలల్లో బియ్యప్పిండి వేసి కలపాలి.    Step 5 బెల్లం కరిగాక పాలు కలిపిన బియ్యప్పిండిని వేసేయాలి. కాసేపటికి పాయసం చిక్కగా అవుతుంది.    Step 6 అప్పుడు కొబ్బరి తురుము, కొబ్బరిపాలూ, యాలకులపొడీ, వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలూ, జీడిపప్పు పలుకులూ పాయసంలో వేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి.          
Yummy Food Recipes
Add