pachiroyyala vankaya curry|non veg recipe|prawns brinjal curry By , 2016-05-23 pachiroyyala vankaya curry|non veg recipe|prawns brinjal curry How to make Brinjal Prawns Curry ,Vankaya Royyala curry. Today I have prepared brinjal with prawns recipe even prawns goes well with vegetables as well. www.telugufoodrecipe.com Prep Time: 20min Cook time: 25min Ingredients: అర కేజీ  పచ్చిరొయ్యలు,టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు,టీ స్పూన్ గరం మసాలా,రెండు రెబ్బలు కొత్తిమీర,ఒక్కటి  ఉల్లిగడ్డ,నాలుగు  పచ్చిమిర్చి,రెండు టేబుల్ స్పూన్లు‌  నూనె,టీ స్పూన్‌  కారం,సరిపడా‌  ఉప్పు,తగినంత‌     పసుపు,రెండు రెబ్బలు‌  కరివేపాకు, Instructions: Step 1 పచ్చి రొయ్యలు వలిచి శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు, వేసి కలిపి స్టవ్ మీద పెట్టి నీరు పోయేంత వరకు ఉడకబెట్టి స్టౌ మీద నుండి దించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ముందుగా వంకాయను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నీళ్లు తీసుకోని అందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేయ్యాలి. ఉల్లి, పచ్చిమిర్చిని కూడా చిన్నచిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకొవాలి. Step 3 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో తగినంత నూనె వేసి వేడిచేస్తూ ఉల్లి, పచ్చిమిర్చిముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసి రెండునిముషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి.. Step 4 ఇప్పుడు మూతతీసి వుడికించిన రొయ్యలు వేసి రెండునిముషాలు వేయించి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి కొన్నీ నీళ్ళు పోసి పదినిముషాలు పాటు వుడకనివ్వాలి.. Step 5 తర్వాత గరంమసాలా, కొత్తిమీర చల్లి ఒక్కసారి బాగా కలిపి మూతపెట్టి స్టౌ ఆపాలి. అంతే మన ముందు ఘుమఘుమలాడే పచ్చిరొయ్యల వంకాయకూర రెడీ..
Yummy Food Recipes
Add