kheema pulao recipe By , 2018-01-23 kheema pulao recipe Here is the process for kheema pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - పావుకిలో,,నూనె - సరిపడినంత,మసాలా దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు) - అన్ని కలిపి మూడు టీస్పూనులు,,గరం మసాలా - ఒక టీస్పూను,,మిరియాలు - ఒక టీస్పూను,జీలకర్ర - ఒక టీస్పూను,,వెల్లుల్లి పాయలు - నాలుగు రెబ్బలు,,ఉల్లి పాయలు - రెండు,,పచ్చిమిర్చి - నాలుగు,,అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీస్పూనులు,,కారం - టీస్పూను,,టోమాటోలు - రెండు (మీడియం సైజువి),,పుదీనా ఆకులు - గుప్పెడు,,కొత్తిమీర - కట్టలో సగం,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బాస్మతి బియ్యం అరగంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఈలోపు స్టవ్ మీద పాత్ర పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.  Step 2 నూనె వేడెక్కాక మసాలా దినుసులు, మిరియాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, తరగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించాలి. ఇప్పుడు కీమా వేసి వేయించాలి.  Step 3 అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు, కారం, పుదీనా ఆకులు వేసి వేయించాలి. అవి బాగా వేగాక మూడున్నర కప్పులు వేడి నీళ్లు పోయాలి.  Step 4 ఆ నీళ్లలో తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి పాత్రలో బియ్యం వేయాలి. గరం మసాలా బియ్యంలో కలపాలి.    Step 5 బియ్యం సగం ఉడికాక స్టవ్ ని సిమ్లో పెట్టి ఉడికించాలి. పావుగంటలో బిర్యానీ ఉడికిపోతుంది. దానిపై కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే ఖీమా పలావ్ రెడీ.           
Yummy Food Recipes
Add
Recipe of the Day