chicken rolls By , 2017-11-24 chicken rolls Here is the process for chicken rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చికెన్ - అర కిలో,,మైదా పిండి - అరకిలో,,ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,,పచ్చిమిరపకాయలు - నాలుగు,,అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు,,గరం మసాలా - అర టీ స్పూను,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత, కొత్తిమీర తురుము - అర కప్పు,,నూనె - సరిపడా., Instructions: Step 1 పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.  Step 2 తరువాత ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. Step 3 ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన చికెన్ వేసి సన్నని మంటపై వేగించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి. Step 4 మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె, కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకుని చపాతీలు చేసుకోవాలి.    Step 5 చపాతి మధ్యలో ఒక టేబుల్ స్పూను చికెన్ వేపుడు పెట్టి నాలుగు వైపులా మడత వేసి గొట్టంలా చుట్టుకోవాలి.    Step 6 మడత ఊడిపోకుండా ఉండడానికి జారుగా కలుపుకున్న మైదా పిండిని మడత దగ్గర పూయాలి.   Step 7 ఈ రోల్స్‌ని నూనెలో వేగించుకోవాలి. చికెన్‌రోల్స్ రెడీ అయినట్టే.           
Yummy Food Recipes
Add