mutton keema balls By , 2018-01-12 mutton keema balls Here is the process for mutton keema balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మటన్ కీమా - పావుకిలో,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,అల్లం- ఒక ముక్క,,వెల్లుల్లి - 5 రేకలు,,పచ్చిమిర్చి - మూడు,,కారం - ఒక టీస్పూను,,ధనియాల పొడి - ఒక టీస్పూను,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 మటన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కీమాలో నీరు లేకుండా పిండేయాలి.  Step 2 ఈలోపు కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, రెండు స్పూనుల నీళ్లువేసి మిక్సీలో పేస్టులా చేసుకోవాలి.  Step 3 ఆ పేస్టులోనే కీమా, ధనియాల పొడి, ఉప్పు, కారం కలిపి వేసి బాగా కలపాలి.  Step 4 ఆ మొత్తం మటన్ కీమా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. చుట్టినప్పుడు గట్టిగా నొక్కితే బాల్స్ విడిపోకుండా ఉంటాయి.    Step 5 ఒక గిన్నెలో నీళ్లు వేసి... అందులో బాల్స్ ని వేసి బాగా ఉడికించాలి. బాల్స్ ముక్కముక్కలుగా విడిపోతాయేమో అన్న భయం అవసరంలేదు. కీమాని కడిగినప్పుడు అందులో నీల్లు పిండేసాం కాబట్టి అంత త్వరగా బాల్స్ విడిపోవు. చక్కగా ఉడుకుతాయి.    Step 6 బాగా ఉడికాక వాటిని బయటికి తీసేయాలి. బాణలిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకుని వేడెక్కాక ... ఈ బాల్స్ ని అందులో వేసి వేయించాలి.    Step 7 గోల్డ్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటే... మటన్ కీమా బాల్స్ సిద్ధమైపోతాయి.               
Yummy Food Recipes
Add