fish masala fry By , 2018-01-12 fish masala fry Here is the process for fish masala fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చేప - ఒకటి,,ఎండుమిర్చి - నాలుగు,,లవంగాలు - మూడు,,దాల్చిన చెక్క - రెండు (చిన్నవి),,యాలకులు - అయిదు,,జీలకర్ర - పావు చెంచా,,మిరియాలు - పావు చెంచా,,అల్లం తరుగు - ఒక చెంచా,,వెల్లుల్లి రెబ్బలు - అయిదు,,ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు సరిపడినంత,,నూనె - సరిపడినంత,,వెనిగర్ - టీ స్పూను, Instructions: Step 1 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చిలను కొంచెం నీటిలో నానబెట్టాలి.  Step 2 అల్లం,వెల్లుల్లి ముక్కల్ని మాత్రం వెనిగర్‌లో నానబెట్టాలి. అనంతరం వాటిన్నింటినీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్నగా తరగాలి.  Step 3 ఇప్పుడు కళాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగును వేపాలి.  Step 4 స్టవ్ కట్టేసి వేపిన ఆ ఉల్లి తరుగును ముందుగా మిక్సీ చేసిన పెట్టుకున్న మసాలా ముద్దలో కలిపాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చేపను తీసుకుంది.    Step 5 రెండు వైపులా కత్తితో గాట్లు పెట్టాలి.అలా అని చేప ముక్కలుగా విడిపోకూడదు. ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లి మసాలా ముద్దని చేపపై పెట్టిన గాట్లలో కూరాలి.   Step 6 అనంతరం నిమ్మరసం, ఉప్పు సరిపడా చేపకు పట్టించాలి. దానిని ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి మారినేషన్ చేయాలి.   Step 7 ఇప్పుడు పెనంపై నూనె వేసి చేపని రెండు వైపులా బాగా కాల్చాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాక స్టవ్ కట్టేయాలి. ఆ చేప మసాలా ఫ్రై సిద్ధమైనట్టే.          
Yummy Food Recipes
Add