rava coconut burfi By , 2018-01-09 rava coconut burfi Here is the process for rava coconut burfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమ రవ్వ - పావుకిలో,,పంచదార - అరకిలో,,పచ్చి కొబ్బరి - అర చెక్క,,నెయ్యి - పావుకిలో,,జీడిపప్పు - గుప్పెడు,,యాలకుల పొడి - ఒక టీ స్పూను, Instructions: Step 1 కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి తురుములా చేసుకోవాలి. దానిని కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 జీడిపప్పును కూడా తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి.  Step 3 అందులో గోధుమ రవ్వని వేసి వేయించాలి. కాస్త బ్రౌన్ రంగులోకి మారే వరకు ఉంచి తీసేయాలి.  Step 4 ఇప్పుడు మరో గిన్నె స్టవ్ మీద పెట్టి పంచదార నీళ్లు కలిపి వేడిచేయాలి.    Step 5 పాకం సాగేలా వచ్చినప్పుడు అందులో వేయించిన గోధుమరవ్వ, కొబ్బరి తురుము జీడిపప్పు వేసి బాగా కలపాలి.    Step 6 కాస్త నెయ్యి కూడా వేస్తూ... కలుపుతూ ఉండాలి. మిశ్రమం కాస్త దగ్గరగా అవుతున్న సమయంలో స్టవ్ కట్టేయాలి.   Step 7 చల్లారిపోకముందు కళాయిలోంచి పెద్ద ప్లేటులో దానిని ఒంపుకోవాలి. చల్లారాక దానికి నచ్చిన ఆకృతుల్లో కోసుకోవచ్చు. ఇవి పదిరోజుల పాటూ తాజాగా నిలవఉంటాయి.          
Yummy Food Recipes
Add