peanut burfi By , 2018-01-08 peanut burfi Here is the process for peanut burfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వేరు శెనగపలుకులు (పల్లీలు) - పావు కిలో,,నెయ్యి - ఒక టీస్పూను,,పంచదార - 150 గ్రాములు,,కుంకుమపువ్వు - రెండు రెమ్మలు,,బాదం, పిస్తాల తరుగు - పావు కప్పు,,నీళ్లు - రెండు గ్లాసులు., Instructions: Step 1 పల్లీలను ముందుగా వేయించుకోవాలి. పైన తొక్క తీసేయాలి. మిగతా వాటిని మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.  Step 2 అలాగే బాదం పలుకులు, పిస్తాల తరుగును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు, చక్కెర వేసి లేతపాకం తీసుకోవాలి.  Step 4 లేత పాకం వస్తున్నప్పుడు పల్లీల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం చిక్కబడుతున్నప్పుడు వేయించిన బాదం, పిస్తాల తరుగును వేసి కలపాలి.   Step 5 అలాగే కుంకుమపువ్వు కూడా వేయాలి. ఆ మిశ్రమం మరీ గట్టిపడకముందే స్టవ్ కట్టేయాలి.    Step 6 ఆ మిశ్రమాన్ని పళ్లెంలో వేసి చల్లారనివ్వాలి. అనంతరం నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి. ఇది వారం రోజుల పాటూ తాజాగా ఉంటాయి.              
Yummy Food Recipes
Add