palak pulao By , 2018-01-05 palak pulao Here is the process for palak pulao making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బాస్మతి బియ్యం - రెండు కప్పులు,,పాలకూర తరుగు - కప్పునిండా,,ఉల్లిపాయ ముక్కలు -పావు కప్పు,,పచ్చి మిర్చి - నాలుగు,,లవంగాలు - నాలుగు,,యాలకులపొడి - అర టీస్పూను,,టొమాటో తరుగు - అరకప్పు,,గరం మసాలా - అర టీస్పూను,,జీడిపప్పులు - గుప్పెడు,,నూనె - సరిపడినంత,,ఉప్పు - తగినంత,,అల్లం వెల్లులి ముద్ద - ఒక టీస్పూను., Instructions: Step 1 బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటూ నానబెట్టుకోవాలి. పాలకూర తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేయాలి. పచ్చిమిర్చి, గరంమసాలా, లవంగాలు, యాలకుల పొడి, జీడి పప్పు వేసి వేయించాలి.   Step 3 అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పాలకూర పేస్టును వేసి వేయించాలి. Step 4 సరిపడా ఉప్పు కూడా వేసి వేయించాలి. అవి బాగా వేగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి వేయించాలి.    Step 5 రెండు నిమిషాలు వేగాక అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టేయాలి. చివర్లో కాస్త నిమ్మరసం చల్లి, గరిటెతో ఓసారి కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే పాలక్ పలావ్ తినడానికి సిద్ధంగా ఉంది.                  
Yummy Food Recipes
Add