butter milk idly recipe By , 2017-07-19 butter milk idly recipe Here is the process for butter milk idly making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బొంబాయిరవ్వ: రెండున్నర కప్పులు,,మజ్జిగ: 4 కప్పులు,,నూనె: 3 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు: రుచికి సరిపడా,,మినపప్పు: టీస్పూను,,సెనగపప్పు: టీస్పూను,,ఆవాలు: టీస్పూను,,తాజా కొబ్బరితురుము: 2 టేబుల్‌ స్పూన్లు,,పచ్చిమిర్చి: రెండు(సన్నగా తరగాలి),,కరివేపాకు: 2 రెబ్బలు,,ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌: టేబుల్‌స్పూను., Instructions: Step 1 ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, 2 టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి. Step 2 చిన్న పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి.  Step 3 ఇప్పుడు కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి.  Step 4 ఇష్టమైతే క్యారెట్‌ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు.  Step 5 చివరగా ఫ్రూట్‌సాల్ట్‌ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండిమిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి. Step 6 ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day