Sabzi bahar recipe By , 2017-11-03 Sabzi bahar recipe Here is the process for Sabzi bahar recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పాలకూర - నాలుగు కట్టలు,క్యారట్ -మూడు,బీన్స్ - పావుకేజి,బాఠానీలు - ఒక కప్పు,వెన్న - చిన్న కప్పు,అల్లం, వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను,ఉల్లిపాయలు - నాలుగు,టమాటాలు - ఐదు,జీడిపప్పు - కొద్దిగా,గసగసాలు - ఒక స్పూను,పెరుగు - రెండు స్పూన్లు,పచ్చిమిర్చి - నాలుగు,జీలకర్ర - ఒక స్పూను,కారం, ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా పాలకూరను చిన్నగా కట్ చేసుకొని నీటితో శుభ్రంగా కడగాలి. Step 2 ఈ పాలకూరను వేడినీటిలో ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో గుజ్జుగా గ్రైండ్ చెయ్యాలి.  Step 3 ఇప్పుడు క్యారట్, బీన్స్ చిన్న ముక్కలుగా తరిగి, ఓ గిన్నెలో బాఠానీలు కలిపి ఉడికించాలి.  Step 4 అలాగే ఒక గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించాలి.    Step 5 అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీడిపప్పు, గసగసాలు మెత్తగా నూరిన మసాలాను వేసి ప్రై చెయ్యాలి.   Step 6 ఆ పైన పెరుగు, టమాట జ్యూస్ వేసి, తగినంత ఉప్పు కలిపి గ్రేవీగా తయారు చెయ్యాలి.   Step 7 ఇప్పుడు ఒక పెనం మీద వెన్న వేసి దానిలో కొంచెం వేసి చిటపటలాడుతుండగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పాలకూర గుజ్జు వేసి కలిపాలి.   Step 8 ఈ మిశ్రమాన్ని ఉడికిస్తూ ముందుగానే ఉడికించిన కూరలను కలపాలి.    Step 9 దానిలో తయారుచేసిన గ్రేవీని కూడా కలిపి కొంచెంసేపు ఉడికించి రైస్‌తో వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన సబ్జీ బహార్ రెడీ.       
Yummy Food Recipes
Add