carrot bread rolls By , 2018-01-06 carrot bread rolls Here is the process for carrot bread rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బ్రెడ్ స్లైసులు - తొమ్మిది,,క్యారెట్ తురుము - ఒక కప్పు,,పనీరు తురుము - పావు కప్పు,,ఉల్లిపాయ - మీడియం సైజు ఉల్లిపాయ,,పచ్చి మిర్చి - రెండు,,మిరియాల పొడి - పావు చెంచా,,వెన్న - ఒక టీస్పూను,,కారం - అర స్పూను,,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ఉల్లిపాయని చిన్నముక్కలుగా కోసుకోవాలి, పచ్చిమిర్చిన నిలువుగా కోసిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త వెన్న వేయాలి.  Step 2 అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. అనంతరం పన్నీర్ తురుమును కూడా వేసి వేయించాలి. Step 3 మిశ్రమం బాగా వేగాక అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటూ వేయించి స్టవ్ కట్టేయాలి. బ్రెడ్ స్లైసుల అంచులు కత్తిరించాలి. Step 4 వాటిలో మధ్యలో వేయించిన మిశ్రమాన్ని ఓ రెండు స్పూనులు వేసి రోల్ లా చుట్టేయాలి. రోల్ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి.    Step 5 అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.   Step 6 నూనె వేడెక్కాక బ్రెడ్ రోల్స్ ని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. టమాటా సాస్ తో తింటే ఈ క్యారెట్ బ్రెడ్ రోల్స్ భలే టేస్టీగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day