egg cutlet By , 2017-12-22 egg cutlet Here is the process for egg cutlet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గుడ్లు - రెండు, (బాగా ఉడికించి ముక్కలుగా కోసుకోవాలి),,పెద్ద బంగాళాదుంపలు - రెండు (ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చిదమాలి),,ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,,అల్లంవెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా,,పచ్చిమిర్చి - ఒకటి(మెత్తగా చేసుకోవాలి),,కరివేపాకు - ఒక రెబ్బ,,పసుపు - అర చెంచా,,కారం - ముప్పావు చెంచా,,ధనియాల పొడి - చెంచా,,గరంమసాలా - అర చెంచా,,కొత్తిమీర తరుగు - పావుకప్పు,,గుడ్డు - ఒకటి(ఉప్పు కలిపి గిలకొట్టుకోవాలి),,బ్రెడ్‌పొడి - ముప్పావు కప్పు,,నూనె - వేయించేందుకు సరిపడా., Instructions: Step 1 బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలూ, అల్లంవెల్లుల్లి ముద్దా, పచ్చిమిర్చి ముద్దా, కరివేపాకు తరుగూ, కాస్త ఉప్పూ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపూ, కారం, ధనియాలపొడీ, గరంమసాలా వేయాలి. Step 2 అందులో చిదిమిన బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి. చేతికి నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ముద్ద తీసుకుని కాస్త వెడల్పుగా చేసి దీంట్లో గుడ్డు ముక్కను పెట్టి మూసేయాలి.  Step 3 ఇలా మిగిలినవీ చేసుకోవాలి. గిలకొట్టిన గుడ్డు సొనలో దీన్ని ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి. ఇలా చేసుకున్న వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి వేడి వేడిగా తింటే బాగుంటాయి.        
Yummy Food Recipes
Add