usiri rice By , 2018-01-02 usiri rice Here is the process for usiri rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం- అరకప్పు,,ఉసిరికాయలు- 10,,పసుపు- అర స్పూను,,ఇంగువ- చిటికెడు,,ఉప్పు- రుచికి తగినంత,,నూనె- తగినంత,,నువ్వుల పొడి- రెండు చెంచాలు,,జీడిపప్పు- 4,,ఎండుమిర్చి- 4(మధ్యకు కట్‌ చేసుకోవాలి),,పచ్చిమిర్చి- 4 (మధ్యకు కట్‌ చేసుకోవాలి),,కరివేపాకు- రెండు రెమ్మలు,,కొత్తిమీర కట్ట- ఒకటి,,శనగపప్పు- ఒక స్పూను,,మినప్పప్పు- ఒక స్పూను,,ఆవాలు- ఒక స్పూన్., Instructions: Step 1 ముందుగా అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి, వాటిని కచ్చా పచ్చాగా దంచాలి. లేదా పెద్ద ఉసిరికాయలైతే తురుముకోవచ్చు. Step 2 తర్వాత, పానలో నూనె వేసి కాగిన తరువాత అందులో పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. Step 3 రెండు మూడు నిమిషాలు మీడియం మంట మీద వేయించుకొని, తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి.        
Yummy Food Recipes
Add