aloo chicken biryani recipe By , 2017-07-17 aloo chicken biryani recipe Here is the process for aloo chicken biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: చికెన్‌: అరకిలో.,సగం ఉడికిన అన్నం: ఒకటిన్నర కిలో,,ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), దాల్చిన చెక్క: చిన్న ముక్క,,యాలకులు: నాలుగు లేక ఐదు,,మిరియాలు: కొన్ని,,బిర్యానీ ఆకు: కొద్దిగా,,పచ్చిమిర్చి: ఎనిమిది,,ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు,,కారం: సరిపడ,,నిమ్మరసం: టేబుల్‌ స్పూను,,కొత్తిమీర ఆకులు: కప్పు,,కుంకుమపువ్వు: కొద్దిగా,,ఉప్పు: రుచికి సరిపడ,,నూనె: తగినంత,,అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఓ పెద్ద గిన్నెలో చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 4 అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి. Step 5 వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లిముద్ద కూడా జతచేయాలి.  Step 6 అన్నీ వేగిన తరువాత చికెన్‌ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి.  Step 7 ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి.  Step 8 దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్‌ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day