butter cauliflower By , 2017-12-30 butter cauliflower Here is the process for butter cauliflower making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్‌: మీడియం సైజుది,,ఉల్లిపాయ: పెద్దది ఒకటి,,అల్లం వెల్లుల్లి ముద్ద: టేబుల్‌ స్పూను,,ఉప్పు: రుచికి సరిపడా,,మైదా: అరకప్పు,,మొక్కజొన్న పిండి: రెండు స్పూన్లు,,కారం: రెండు టేబుల్‌ స్పూన్లు,,పచ్చిమిరపకాయలు: రెండు,,జీడిపప్పు: పది పదిహేను,,పాలు: అరకప్పు,,టమోటా గుజ్జు: టేబుల్‌ స్పూను,,నూనె: తగినంత,,వెన్న: నాలుగు టేబుల్‌స్పూన్లు.,   Instructions: Step 1 ముందుగా పాలల్లో జీడిపప్పును 30 నిమిషాలు నానపెట్టుకోవాలి. అనంతరం పాలల్లోంచి వాటిని తీసి ముద్దగా నూరి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా, మొక్కజొన్నపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు అన్నీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్‌ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ముప్పావు గంట అయిన తరువాత మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని నూనె వేసి కాగిన తరువాత కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు మరొక గిన్నెలో వెన్న వేసి కరిగిన తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగిన తరువాత కాలీఫ్లవర్‌ ముక్కలు టమోటాగుజ్జు కూడా జతచేసి మరికొద్ది సేపు వేయించుకోవాలి. Step 4 ఇప్పుడు మిగిలిన పాలు జీడిపప్పు ముద్ద కూడా జతచేసి కొద్దిగా వెన్నను చివరగా వేసుకోవాలి. ఇది ఫ్రైడ్‌రైస్‌లోకి రుచిగా ఉంటుంది.              
Yummy Food Recipes
Add