Beerakaya Ullikaram By , 2017-12-30 Beerakaya Ullikaram Here is the process for Beerakaya Ullikaram making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్టు తీసి కోసిన ఐదు బీరకాయలు,,కొద్దిగా నూనె., ,మసాలాముద్దకు:,పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి,,ఒక టేబుల్‌ స్పూను నూనె.,,పొడి మసాలాకు:,శెనగపప్పు: అర టేబుల్‌స్పూను,,మినప్పప్పు: అర టేబుల్‌స్పూను,,జీలకర్ర: అర టేబుల్‌స్పూను,,ఆవాలు: అర టేబుల్‌స్పూను,,ఎండుమిర్చి: 2,,కొద్దిగా నెయ్యి, చక్కెర, ఉప్పు తగినంత., Instructions: Step 1 పాన్‌లో కొద్దిగా నూనె వేడెక్కాక అందులో బీరకాయముక్కల్ని వేయాలి. మూతపెట్టకుండా బీరకాయ ముక్కల్ని ఉడకనిస్తే నీరు బయటకు వచ్చేస్తుంది. అలా ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 2 బీరకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. వేరే పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ గుజ్జు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకూ వేగించాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి. Step 3 మరో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అందులో మినప్పప్పు, శెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి వేసి సువాసన వచ్చే వరకూ వేగించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడిచేయాలి. Step 4 ఆ పొడిని ముందుగానే నూనెలో వేగించిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఉడికిన బీరకాయ ముక్కల్లో వేయాలి. కూరలో నీరు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.    Step 5 ఈ కూరలో ఒక టీస్పూను చక్కెర, ఉప్పును వేసి కలిపి స్టవ్‌ మీద కొద్ది నిమిషాలు ఉంచి కాస్త డ్రై అయిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించాలి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ కూర తింటే చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day