soya ballss recipe cooking tips healthy ingradients food item By , 2015-01-03 soya ballss recipe cooking tips healthy ingradients food item soya balls recipe cooking tips healthy ingradients food item : the cooking tips to make soya balls recipe which filled with number of healthy ingradients. Prep Time: 25min Cook time: 25min Ingredients: ఒక కప్పు మీల్ మేకర్ (ఉడికించుకోవాలి), 1 టీ స్పూన్ కార్న్’ఫ్లోర్, 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ గరంమసాలా, 2 టీ స్పూన్స్ సోయాసాస్, 2-3 పచ్చిమిర్చి, తగినన్ని అల్లంవెల్లుల్లి ముక్కలు, సరిపడా నూనె, తగినన్ని పుదీనా, తగినన్ని జీడిపప్పు, తగినన్ని కొత్తిమీర, 5-6 టమోటా ముక్కలు (రౌండ్’గా తరగాలి), Instructions: Step 1 స్టౌవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో మధ్యలో చీల్చిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. Step 2 అనంతరం అందులోనే మీల్’మేకర్ వేసి వేడి చేయాలి. 2 నిముషాల తర్వాత సోయాసాస్ కూడా కలిపి చివర్లో ఒక టీ స్పూన్ నీటిని జతచేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత ఈ పదార్థాన్ని సర్వింగ్ డిష్’లోకి మార్చుకోవాలి. Step 3 ఇలా డిష్’లో వేసిన అనంతరం దానిపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, గుండ్రంగా తరిగిన టమోటా ముక్కలతో అందంగా సర్దుకోవాలి. అంతే! సోయా బాల్స్ రెడీ! అవసరమైతే దీనికి క్యాబేజీ తరుగు, కీరా ముక్కలు, చిప్స్ కూడా జతచేస్తే ఇంకా రుచిగా వుంటుంది.
Yummy Food Recipes
Add