ravva pongali By , 2017-12-23 ravva pongali Here is the process for ravva pongali making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: రవ్వ: 2 కప్పులు,,పెసరపప్పు: కప్పు,,జీడిపప్పు: అరకప్పు,,నెయ్యి: కప్పు,,కరివేపాకు: నాలుగురెబ్బలు,,అల్లంతురుము: టీస్పూను,,మిరియాలు: 2 టీస్పూన్లు,,జీలకర్ర: 2 టీస్పూన్లు,,ఉప్పు: రుచికి సరిపడా., Instructions: Step 1 బాణలిలో నూనె లేకుండా రవ్వ వేయించి తీయాలి. అందులోనే టీస్పూను నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర కూడా వేసి వేయించి తీసి పొడి చేయాలి. అదే బాణలిలో మరో రెండు టీస్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు వేయించి తీశాక, అల్లం తురుము, కరివేపాకు వేయించి తీయాలి. Step 2 ఇప్పుడు కుక్కర్‌లో పెసరపప్పు వేసి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. తరవాత దీన్ని మందపాటి బాణలిలో వేసి మరో రెండు కప్పుల నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు వేయించిన రవ్వ వేసి నెమ్మదిగా కదుపుతూ ఉడికించాలి. Step 3 రవ్వ ఉడుకుతుండగా నెయ్యి కొంచెంకొంచెంగా వేస్తుండాలి. చివరగా కచ్చాపచ్చాగా పొడి చేసిన మిరియాలు, జీలకర్రతోబాటు వేయించిన జీడిపప్పు, కరివేపాకు, అల్లంతురుము వేసి దించాలి. దీన్ని కొబ్బరిచట్నీతో తింటే ఆ రుచే వేరు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day