ravva pulihorra recipe By , 2017-07-07 ravva pulihorra recipe Here is the process for ravva pulihorra making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బియ్యపు రవ్వ – నాలుగు కప్పులు,శనగపప్పు – చిన్న కప్పు,మినపపప్పు – చిన్న కప్పు,ఆవాలు – కొద్దిగా ,,ఇంగువ – చిటికెడు,వేరుశనగలు – ఒక కప్పు,ఎండు మిర్చి – ఎనిమిది,పచ్చిమిర్చి – పది,కరివేపాకు – ఐదు రెబ్బలు,చింతపండు – తగినంత,పసుపు – ఒక స్పూను,ఉప్పు, నూనె – తగినంత., Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు ఎసరు పెట్టి, దానిలో బియ్యపు రవ్వ కలిపి పొడిపొడిగా ఉడికాక స్టౌ మీద నుంచి  కిందికి దించుకోవాలి.  Step 2 తరువాత రెండు స్పూన్లు నూనె పైన పోసి, మూతపెట్టి ఉమ్మగిల్లే వరకు ఉంచాలి.  Step 3 అలాగే దీన్ని ఒక వెడల్పు పళ్లెంలో తీసి చల్లార్చాలి. ఈ మిశ్రమం పొడిగా ఉండేలా చేతితో చిదపాలి.  Step 4 ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, వేరుశనగలు, శనగపప్పు, మినపపప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు వేసుకోవాలి. Step 5 తర్వాత అందులో చింతపండు గుజ్జు పిండి ఉడికించాలి.  Step 6 ఈ మిశ్రమాన్ని పళ్లెంలో చల్లార్చిన రవ్వ పిండిలో కలుపుకోవాలి. Step 7 అంతే ఎంతగానో ఊరించే రవ్వ పులిహోర రెడీ. ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే అదుర్స్.  
Yummy Food Recipes
Add
Recipe of the Day