mottom or chicken kheema By , 2017-11-21 mottom or chicken kheema Here is the process for mottom or chicken kheema making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మటన్ లేదా చికెన్ కీమా : 250 గ్రా.లు,పాస్టా : 250 గ్రా.లు,ఉల్లిపాయ : 2,టమాటాలు : 3,అల్లం వెల్లుల్లి ముద్ద : 2 టీ స్పూను,పసుపు : 1/3 టీ స్పూను,కారం పొడి : 2 టీ స్పూను,ధనియాల పొడి : 2 టీ స్పూను,గరం మసాలా పొడి : 1/2 టీ స్పూను,ఉప్పు : తగినంత,కొత్తిమిర : 3 టీ స్పూను,నూనె : 5 టీ స్పూను, Instructions: Step 1 లీటర్ నీరు మరిగించి పాస్టా వేయాలి. అది ఉడికిన తర్వాత జల్లెట్లో వేసి చన్నీళ్లు పోయాలి. దానివల్ల అవి ఇంకా ఉడికి ముద్దగా కాకుండా విడివిడిగా ఉంటాయి. కీమా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.  Step 3 ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి వేసి కొద్దిగా వేపాలి. Step 4 ఇప్పుడు కీమా వేసి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి కలిపి నీరంతా పోయేవరకు వేయించాలి.    Step 5 తర్వాత ఒక కప్పుడు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.   Step 6 కీమా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి.   Step 7 ఇప్పుడు ఉడికించిన పాస్టా, సన్నగా తరిగిన కొత్తిమిర, గరం మసాలా పొడి వేసి కలిపి మరో పది నిమిషాలు నిదానంగా ఉడికించాలి.   Step 8 మొత్తం ఉడికినతర్వాత దింపి వేడిగా సర్వ్ చేయాలి. నాన్ వెజ్ తిననివాళ్లు మటన్ కీమా బదులు సోయా కీమా, పనీర్ కూడా ఉపయోగించవచ్చు…          
Yummy Food Recipes
Add