punjabi kadhi recipe By , 2017-08-31 punjabi kadhi recipe Here is the process for punjabi kadhi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగపిండి - 200 గ్రా,ఉల్లిపాయలు - రెండు (తరగాలి),బంగాళదుంపలు- రెండు (ఉడికించాలి),,వాము - 10 గ్రా,,మిరప్పొడి - 30 గ్రా,,సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 15 గ్రా,,సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక కప్పు,,నూనె - అర కప్పు,,సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు - 20గ్రా,,పెరుగు - కప్పు,,ఉప్పు - 15 గ్రా,,ఎండుమిర్చి - 10 గ్రా,,పసుపు - 15 గ్రా,,ఇంగువ - 5 గ్రా,,ఆవాలు - 5 గ్రా,,జీలకర్ర - 5 గ్రా,,పచ్చిమిర్చి -10 గ్రా., Instructions: Step 1 ఒక పాత్రలో శనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన బంగాళదుంప, సగం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, వాము వేసి తగినంత నీటితో ముద్దగా కలుపుకోవాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని చిన్న పకోడీలుగా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టాలి. Step 3 మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేయాలి. Step 4 అవి వేగిన తర్వాత పెరుగు కలపాలి. అందులో మిరప్పొడి, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి వేయించాలి.    Step 5 ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కన ఉంచిన పకోడీలను వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day