Kaddu Kofta Curry Recipe By , 2017-11-04 Kaddu Kofta Curry Recipe Here is the process for Kaddu Kofta Curry Recipe making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: సొరకాయ - ఒకటి,సెనగపిండి - రెండు కప్పులు,పచ్చిమిర్చి - నాలుగు,ఉల్లిపాయలు - నాలుగు,అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక స్పూను,ధనియాలపొడి - ఒక స్పూను,గసగసాలు - నాలుగు స్పూన్లు,పచ్చికొబ్బరి - చిన్న కప్పుతో,టమాటాలు - మూడు,పెరుగు - ఒక కప్పు,కారం - రెండు స్పూన్లు,పసుపు - చిటికెడు,నూనె - ఒక కప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా సొరకాయ(అనపకాయ)ను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. Step 2 ఆ తురుములో సెనగపిండి, ఉప్పు, మెత్తగా గ్రైండ్ చేసిన అల్లం, వెల్లుల్ల్లి, పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసి కలపాలి.  Step 3 సొరకాయలో నీరు వుంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది. *గట్టిపకోడిల పిండి మాదిరిగా రావాలి.  Step 4 ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి వేడి నూనెలో ఎర్రగా వేయించి, గ్రేవీలో వేసి ఓ పదినిమిషాలు మగ్గిస్తే కద్దూ కోఫ్తా కర్రీ  రెడీ అయినట్టే ఈ కూర చపాతిలలోకి బాగుంటుంది.   గ్రేవీ తయారు చేసే విధానం: Step 5 ఒక గిన్నెలో నూనె పోసి వేడిచేశాకా ముందుగా ఉల్లిపాయలు ముక్కల్ని ఎర్రగా వేయించండి.    Step 6 ఆ తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ధనియాలపొడి కలపాలి.    Step 7 అలాగే టమాట ముక్కల్ని కూడా వేసి కాసేపు వేయించాలి.    Step 8 ఆ తరువాత గసగసాలు, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్  చేసి ఆ ముద్దని కూడా చేర్చాలి.    Step 9 దించే ముందు పెరుగుని వేసి సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు ఉంచితే గ్రేవీ సిద్దమయినట్టే.       
Yummy Food Recipes
Add